కర్లపాలెంలో నీట మునిగిన మిరప పంట
కర్లపాలెం మండల పరిధిలోని పలు గ్రామాలలో వాయుగుండం ప్రభావంతో వారం నుంచి పడుతున్న వర్షం ధాటికి పలు రకాల పంటలు నీట మునిగాయి. కాగా మండల పరిధిలో పచ్చిమిర్చి, వేరుశనగ, దోసకాయ, బీరకాయ తదితర రకాల కూరగాయల పంటలు వేసి నెల కూడా కాక ముందే వర్షాలు రావడంతో పంట లేత వయసు వల్ల వర్షం ధాటికి మొక్కలు పూర్తిగా చనిపోయాయి. ప్రభుత్వ స్పందించి పంట నష్టపరిహారం ఇచ్చి, ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.