పల్నాడు ప్రజల దశాబ్దాల కలయిన వరికపూడిసెల ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభిస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే సంవత్సరం జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి మరో సంవత్సరంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, హామీలను నెరవేరుస్తామన్నారు.