కారంపూడి సర్కిల్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

56చూసినవారు
కారంపూడి సర్కిల్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
కారంపూడి సర్కిల్ పోలీసు స్టేషన్ ను గురజాల డీఎస్పి జగదీశ్ గురువారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పోలీసు స్టేషన్ ఆవరణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్