ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేకపోతే భవిష్యత్తులో రాజకీయంపై మాట్లాడనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా ఉంటానని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మాచర్ల పార్టీ ఆఫీసులో శనివారం మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సీఎం చంద్రబాబు చొరవతో తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. వరికపూడిసెల ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడాదిలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.