మాచర్ల మండలం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచ్ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. ఈ లాంచ్ సాయంత్రానికి శ్రీశైలం చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలంలో స్వామివారి దర్శనం అనంతరం ఆదివారం మళ్లీ లాంచ్ తిరిగి సాగర్ చేరుకొనుంది. ఈ లాంచ్ సుమారు 100 మంది టూరిస్టులతో బయలుదేరింది. 6 గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని అధికారులు తెలిపారు.