నూతన పైప్ లైన్ ఏర్పాటుకై వినతి

951చూసినవారు
నూతన పైప్ లైన్ ఏర్పాటుకై వినతి
నెహ్రు నగర్లోని చర్చి వద్ద పైప్ లైన్ పాత పడటంతో నీటి సరఫరాకు పలు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయవలసిందిగా ఒకటో వార్డు కౌన్సిలర్ గట్ల అరుణ కుమారి కోటిరెడ్డి కోరారు. సోమవారం మాచర్ల మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ను కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. ఈ పైప్ లైన్ 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేయడం వల్ల మాటిమాటికి మరమ్మతులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల 1, 2, 3 వార్డులకు పలు సందర్భాల్లో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతున్నాయని కౌన్సిలర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. స్పందించిన కమిషనర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్