మంగళగిరి: ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ధర్నా: సీపీఐ

84చూసినవారు
మంగళగిరి: ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ధర్నా: సీపీఐ
ప్రభుత్వం ఉచిత ఇసుకను అందించి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 11న ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి సీపీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో సత్యనారాయణ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్