పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పిడిఎం నాయకులు ఆదివారం నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.