ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికు వచ్చే ప్రతీ ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లాలోని 70 మంది అర్జీదారులు తమ వినతులను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు అందించారు.