రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే, ఎల్పీ నెంబర్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు ఆదివారం నరసరావుపేటలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ రెవిన్యూ సభలలో రైతులు పెద్ద ఎత్తున అర్జీలు ఇచ్చిన ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.