డివైడర్ను ఢీకొని కారు డ్రైవర్ మృతి

660చూసినవారు
డివైడర్ను ఢీకొని కారు డ్రైవర్ మృతి
రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం అడ్డరోడ్డు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో కారు డ్రైవర్ మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న కారు ముందువెళ్తున్న లారీని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్ కోసూరు నాగేశ్వరరావు (47) మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ చల్లా సురేష్ పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్