కారంచేడు గ్రామానికి చెందిన మారెళ్ళ సదాశివరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం రాత్రి చీరాల ఎమ్మెల్యే కొండయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రోడ్డు ప్రమాదం దర్యాప్తు విషయమై ఎమ్మెల్యే కొండయ్య పోలీసులను ఆరా తీశారు.