వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పంచాయతీ నందు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న డానియల్ వివేకానంద కాలనీలో విద్యుత్ పనుల నిమిత్తం కరెంటు స్తంభం ఎక్కాడు. కరెంట్ సప్లై రావటంతో అతను విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.