అచ్చంపేట మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సోమవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. ప్రజల నుంచి 300కు పైగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రైతులను ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలు లేకుండా పనిచేస్తామని చెప్పారు.