పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిత్య తెలిపారు. శనివారం మండలంలోని తాళ్లూరు, పెదకూరపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని మాగులూరి ఫౌండేషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు మాగులూరి కృష్ణారావు, కొండవీటి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.