గ్రామ రెవెన్యూ సహాయకుల నిబంధనలకు విరుద్ధంగా వేసిన అక్రమ డ్యూటీలను రద్దు చేయాలని కోరుతూ వీఆర్ఏల సంఘం (సిఐటియు) డిమాండులతో కూడిన వినితిపత్రాన్ని పెదకూరపాడు తహశీల్దార్ దానియేలుకు శనివారం అందించారు. నవంబర్ 4న నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సంఘ నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్, మండల ప్రధాన కార్యదర్శి ఖాసిం, సెక్రెటరీ ఏడుకొండలు పాల్గొన్నారు.