అమరావతి మండలంలోని లింగాపురం నుండి పెదకూరపాడు మండలంలోని పరస వరకు ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల నిండా ఎటు చూసినా వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఆ నీరంతా రోడ్లపైకి వస్తుంది. రోడ్ల పైన ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.