ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పెదకూరపాడు మండలంలోని లింగంగుంట్ల గ్రామ వాసులు వరద బాధితుల సహాయార్థం ఒక లక్ష 15వేల116 రూపాయలను అందించారు. గ్రామస్తుల నుండి చందాలు సేకరించి పంపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, ఎలమంచిలి భాగ్యలక్ష్మి, వీరపనేని మురళి, గంగినేని వెంకటేశ్వర్లు, మేదరమెట్ల శ్రీనివాసరావు, గంగినేని లీలావతి పాల్గొన్నారు. వారిని చంద్రబాబు నాయుడు అభినందించారు.