పిడుగురాళ్ల: కోనంకిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పిడుగురాళ్ల మండలంలోని కోనంకి, పాతగణేశునిపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో ముందుగా సహాయ వ్యవసాయ సంచాలకులు బి.శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ వారు అందించే వివిధ రకాల పథకాలు, సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాజశేఖర్, ఉమాహేశ్వరరెడ్డి గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.