ఈనెల 5న పిడుగురాళ్లలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ

60చూసినవారు
ఈనెల 5న పిడుగురాళ్లలో ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ
ఈనెల 5వ తేదీన పిడుగురాళ్ల పట్టణం పిల్లట్ల రోడ్డు, షాదిఖానా నందు జరగనున్న ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పిడుగురాళ్ల, షాదీఖానా నందు సంబంధిత కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. సభకు విద్యార్థులు, రైతు కూలీలు, మహిళలు, కార్మికులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్