పిడుగురాళ్ల పట్టణంలోని షాదీ ఖానాలో మంగళవారం సాయంత్రం ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబా సంస్మరణ సభ జరిగింది. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సాయిబాబా నడవలేకపోయినా సమాజానికి, ఉద్యమాలకు నడక నేర్పారని అన్నారు. గడ్చిరోలి బెంచ్ సాయిబాబాకు విధించిన జీవిత ఖైదు తీర్పు న్యాయవ్యవస్థలో అత్యంత దారుణమని, మావోయిస్టుల పేరిట ఆదివాసులను అణచివేయడం తగదని ప్రశ్నించారు.