పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 19 మందికి మొత్తం రూ. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించామన్నారు. గతంలో కూడా పేదలకు 25 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించామని తెలిపారు.