AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. అయితే గుండెకు బైపాస్ సర్జరీ లేదా స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకోనున్నారు.