AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో సోమవారం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దాంతో మంగళవారం ఉ.11 గంటలకు విచారణకు హాజరుకావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు.