ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

56చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ నుంచి కిష్టాపూర్ వెళ్లే దారిలో ఏక్ మినార్ మసీదు వద్ద గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్