కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల(నేషనల్ హైవే) విస్తరణ భారీ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో 25,000 కిలోమీటర్ల రెండు లేన్ల రహదారులను నాలుగు లేన్లుగా, అలాగే 16,000 కిలోమీటర్ల రహదారులను ఆరు లేన్లుగా అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ రవాణా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఆర్థిక అభివృద్ధి మెరుగుపడటంతో పాటు, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు దోహదం చేయనుంది.