గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమస్యల పరిష్కార వేదికకు 11 అర్జీలు అందినట్లు డిప్యూటీ తాసిల్దార్ ప్రశాంతి తెలిపారు. సి ఎస్ డి టి-2, రెవిన్యూ -6, మున్సిపాలిటీ-1, ఇరిగేషన్-1, ఆర్ అండ్ బి-1 మొత్తం 11 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.