ఏపీలోని తిరుపతి లడ్డూ వివాదంలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానన్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఆయన అనర్హుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దయచేసి హిందూ, ముస్లీం, క్రిస్టియన్ మధ్యలో గొడవలు పెట్టొద్దని భావించారు. రాష్ట్రాన్ని విభజించవద్దు” అని పాల్ రిక్వెస్ట్ చేశారు.