పెదకాకాని గ్రామం లూథర్గిరి కాలనీలోని రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి రాజారాం కు శనివారం తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు. రోడ్డు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ప్రమాదకరంగా ఉందని సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తెదేపా నాయకులు కొర్రపాటి సురేష్, మహిళా నాయకురాలు సరిత, ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు దానబోయిన సాంబయ్య పాల్గొన్నారు.