జి బి సి రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభo

60చూసినవారు
పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి జి బి సి రోడ్డు అభివృద్ధి విస్తరణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. 650 మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆర్ అండ్ బి ఏఈ రాంబాబు మీడియాకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికపై బీటీ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యత లోపాలు లేకుండా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్