ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలకు ఉపక్రమిస్తుంది

1143చూసినవారు
సిపిఎస్ రద్దుకై విజయవాడలో ముట్టడించిన నాటినుండి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలకు ఉపక్రమిస్తుందని పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కా శ్రీనివాసరావు అన్నారు. పొన్నూరు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బోధనేతర విధుల నుండి మినహాయిపు అడిగితే దశాబ్దాలుగా ఉపాధ్యాయులచే నిస్పక్షపాతంగా నిర్వహించే ఎన్నికలు, జననగణన విధులకు స్వస్తిచెప్పటం ద్వారా పాలక వైకాపా ప్రభుత్వం మరోసారి ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడినట్టు స్పష్టమవుతుందని గుర్తు చేశారు. అన్నపూర్ణ, జగనన్న విద్యా కానుక, నాడు- నేడు పర్యవేక్షణ లకు బోధనేతర సిబ్బందిని కేటాయించమని కోరిన ఉపాధ్యాయులకు వీటిపై మినహాయింపు ఇవ్వటం ప్రభుత్వ కపట వైఖరి తెలుస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయుల పక్షాన నిలుస్తుందని, నాడు కోవిడ్ ఉధృతిలో స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వర్తించి కోవిడ్ సోకి మరణించిన ఉపాధ్యాయుల పక్షాన మొదటిగా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇచ్చామని, అలాగే నేడు జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తున్నామని, ప్రభుత్వం జననగణనకు, ఎన్నికల విధులకు వాలంటీర్ లను ఉపయోగించాలనుకుంటే చూస్తూ ఊరుకోమని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల విధులనుండి ఉపాధ్యాయులను తొలగించటాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులతో జక్కా తాసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, ఎంఈఓ శోభా చంద్ లకు వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్