పొన్నూరు: ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి: కమిషనర్

66చూసినవారు
పొన్నూరు పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ పొన్నూరు సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ ప్రారంభించారు. రక్తదానం చేయడం వలన ఎందరో ప్రాణాలు కాపాడతామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని వారు సూచించారు. రోటరీ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్