గుంటూరు జిల్లా నిడుబ్రోలు-పొన్నూరు గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పొలాలను పరిశీలించారు. వరి పొలాలు వెన్ను బయటకు వచ్చి పూత దశలో ఉన్నాయని రైతులు అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లో జోన్ 75%, ఎస్పీ 120 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. పిచికారి సమయం మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి 5 గంటల మధ్య ఉండేటట్లు చూసుకోవాలని అవగాహన కల్పించారు.