సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

267చూసినవారు
సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామా సర్పంచ్ అక్కి నాగరాజు ఇటీవల అనారోగ్యానికి గురై గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆదివారం వైద్యశాలకు వెళ్లి నాగరాజును పరామర్శించారు. అనంతరం సర్పంచ్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు చండూరు వీరయ్య, ముద్రబోయిన తిరుపతయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్