కాకుమాను మండల వ్యవసాయాధికాణి కిరణ్మయి వల్లూరు, చినలింగాయపాలెం, కె బి పాలెం, కొల్లిమర్ల గ్రామాలలో వరద ముంపుకు గురైన వరి పంట పొలాలను బుధవారం పరిశీలించారు. పొలంలో నీరు ఉన్నా వరి మొక్క 4 నుండి 5 రోజుల వరకు తట్టుకోగలగి తిరిగి కొలుకోగలదని రైతులకు తెలియచేసారు. పొలంలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియా+ 15 కిలోల ఎం ఓ పి అదనంగా వేసుకోవాలని సూచించారు. నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేస్తామని తెలిపారు.