చీరాల: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

56చూసినవారు
చీరాల: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి
నడుస్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన స్టువర్టుపురం - బాపట్ల రైల్వేస్టేషన్ల మధ్య బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన గ్యాంగ్ మెన్ చీరాల రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కొండయ్య ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్