సంక్రాంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రేపల్లె పట్టణంలో ముగ్గుల పోటీలు కుర్చీల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని నేతాజీ కాలనీలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణి లాల్ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు ఆటలు పోటీలు ప్రజల మధ్య ఐక్యతకు ఉపయోగపడతాయన్నారు. తెలుగు యువత అధ్యక్షులు కొలసాని రాము విజేతలకు బహుమతులు అందించారు.