విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన పచ్చమొక్కులను అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెదనందిపాడు మండల వైసీపీ నేత షేక్ ఖాసిం పీరా డిమాండ్ చేశారు. శనివారం పెదనందిపాడులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. రాష్ట్రంలో రోజురోజుకు వైసిపి శ్రేణులపై దాడులు చేయటమే కాకుండా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై దాడి చేయడం దుర్మార్గమని ఆరోపించారు.