వాహనాలు తనిఖీలు చేసిన వెహికల్ ఇన్ స్పెక్టర్ మల్లేశ్వరి

74చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో ఇంజనంపాడు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం గుంటూరు వెహికల్ ఇన్ స్పెక్టర్ మల్లేశ్వరి వాహనాలను తనిఖీ చేశారు. స్కూల్ బస్సుల తో పాటు వివిధ రకాల వాహనాలకు ఫిజికల్ ఫిట్ నెస్, అన్నిరకాల అనుమతులను పరిశీలించారు. ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్