కృష్ణుడంటే నల్లనివాడు. కనబడకుండానే సృష్టి అంతయూ వ్యాపించినవాడు. అవగాహనకు మించినవాడు. శ్రీ అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి, కాళి. శ్రీకి అతడే ఆధారము. కృష్ణుడు లేని శ్రీ లేదు. అంటే శ్రీ ఆయన వ్యక్త రూపమే. సనాతనుడు అంటే సృష్టి ఉన్నా లేకున్నా ఉండేవాడని అర్థం. సమస్త సృష్టి, దేవతలు, జీవులు ఆయన నుంచే ఉద్భవించి మళ్లీ ఆయన్నే చేరతాయి. కాలానికి పూర్వమే ఉన్నాడాయన. అందుకే ఆయన శ్రీకృష్ణ: సనాతన: