తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

81చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఏడి సైదా నాయక్ అన్నారు. బుధవారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ వాయుగుండం ప్రభావం వల్ల ఈనెల 16, 17, 18 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపద్యంలో మత్స్యకారులందరూ తమ విలువైన బోట్లను, మత్స్య సామాగ్రిని జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు. సముద్రంలో అలల ఉధృతి వల్ల బోట్లు తిరగబడే ప్రమాదం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్