రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 5 ఫిర్యాదులు అందినట్లు ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. రేపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆర్డీవో తెలిపారు.