రోడ్డుపై నిలబడ్డ లారీ దహనం

4016చూసినవారు
లోడ్ తో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించిన సంఘటన రాజుపాలెం మండల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. రాజుపాలెం- బెల్లంకొండ రహదారిపై ఒక్కసారిగా లారీకి మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవరు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్