పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారిదోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 26 తెల్లవారుజామున బస్టాండ్ ప్రాంతంలో బస్సు కోసం ఎదరుచూస్తున్న మహిళను ప్యాసింజర్ ఆటోలో ఎక్కించుకొని ఆమెను బెదిరించి దుండగులు నగలు దోచుకొనివెళ్ళారు. దారిదోపిడీకి పాల్పడినవారు గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం తెలిపారు.