సత్తెనపల్లిలోని రఘురామ్ నగర్ ప్రజావేదికలో ప్రతిభావంతులైన విద్యార్థులకు శనివారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 నుంచి కన్నా రంగయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఛారిటబుల్ ట్రస్ట్ సేవలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు.