సత్తెనపల్లి: కుటుంబ గొడవలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబంలో ఏర్పడిన విభేదాలతో లక్కరాజుగార్లపాడులో గూడూరి పుల్లారావు (40) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. మద్యం అలవాటుతో పుల్లారావు కొన్ని రోజులుగా కూలి పనులకు వెళ్లడంలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భార్య ప్రభావతి నిలదీస్తోంది. ఈక్రమంలో భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.