సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ హనుమంతరావు అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.