జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధివిధానాలపై సత్తెనపల్లి పట్టణంలోని లయోలా కాలేజీ విద్యావంతులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓటు నమోదుకు అవసరమైన పత్రాలు అన్నింటిని అందుబాటులో ఉంచామని తెలిపారు.