అత్యంత అధ్వాన్నంగా ఉన్న బిఆర్ స్టేడియంను వెంటనే అభివృద్ధి చేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రభుత్వాన్ని కోరారు. 26 ఎకరాలు ఉన్న స్టేడియం కబ్జాలకు గురై 18 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్టేడియం పట్ల గత పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. త్వరితగతిన స్టేడియంను బాగు చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.