గుంటూరు జిల్లా మేడీకొండూరు మండలం పేరేచర్లలోని శ్రీ లక్ష్మీగణపతి రైస్ మిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లు ప్రాంతంలో రేషన్ సప్లై చేసే వాహనం ఉండడం చూసి మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. వాహనాన్ని సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. రైస్ బ్యాగ్ ట్యాగ్ ల దహనం పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారకులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.